మంత్రి జోగి రమేష్ కు తృటిలో త‌ప్పిన‌ ప్రమాదం

Minister Jogi Ramesh Narrowly Missed An Accident. చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు వెళుతున్న రాష్ట్ర‌ మంత్రి జోగి రమేష్ కి

By Medi Samrat  Published on  6 Jun 2022 3:00 PM IST
మంత్రి జోగి రమేష్ కు తృటిలో త‌ప్పిన‌ ప్రమాదం

చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు వెళుతున్న రాష్ట్ర‌ మంత్రి జోగి రమేష్ కి తృటిలో ప్రమాదం తప్పింది. నేషనల్ హైవే 16 పెళ్లూరు వద్ద కాన్వాయ్ జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన దారి మళ్లింపుకు సంబంధించిన బార్ల వ‌ద్ద‌ కాన్వాయ్ ముందు కారు బ్రేక్ వేయడంతో ఒకదానితో ఒకటి మూడు కార్లు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టాయి. కాన్వాయ్ లో ఉన్న మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన వేరే వెహికల్స్ లో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మంత్రి జోగి రమేష్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ కార్లు జాతీయ రహదారిపై ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ముందుగా వెళ్తున్న ఓ కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న ఇతర కార్లు ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్ మధ్యలో ఉన్న మంత్రి జోగి రమేష్ కారు కూడా బ్రేక్ వేయబోయి డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న జోగి రమేష్ కు ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలిపారు.










Next Story