దమ్ముంటే రండీ.. ఆ బాధ్యతలు అప్పగిస్తాం

Minister Jogi Ramesh Fire On Ramoji Rao. రాష్ట్రంలో మంచి రామోజీరావు కళ్లకు కనిపించడం లేదా..? అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్

By Medi Samrat
Published on : 9 Nov 2022 9:00 PM IST

దమ్ముంటే రండీ.. ఆ బాధ్యతలు అప్పగిస్తాం

రాష్ట్రంలో మంచి రామోజీరావు కళ్లకు కనిపించడం లేదా..? అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. ఇళ్ల నిర్మాణంపై ఏనాడైనా వార్త రాశావా రామోజీ..? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 31 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అంద‌జేశామ‌ని పేర్కొన్నారు. చంద్రబాబు ఇళ్ల స్థలాలు ఇవ్వక పోయినా.. సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా.. రామోజీకి కమ్మగా, సమ్మగా ఉంటుందని సెటైర్లు సంధించారు. ఒక పక్క కూల్చని ఇళ్లను కూల్చేశారని ఏడుస్తాడు. మరో వైపు లక్షల ఇళ్లు నిర్మిస్తుంటే.. ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తుంద‌ని మాత్రం రాయ‌ర‌ని విమ‌ర్శించారు. రామోజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని.. విష పురుగులా కాటేస్తున్నాడని.. రామోజీ నీకు మానవత్వం ఉందా..? అని ప్ర‌శ్నించారు.

రామోజీ.. మీరు కూడా ఇళ్ల నిర్మాణం చేస్తామంటే.. మీకు కూడా ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తాం. ఎల్లో మీడియా అధినేతల్లారా.. రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు మీరు ఏపీకి రండి.. మీకు ఇళ్లు కట్టించే బాధ్యతలు అప్పగిస్తాం. చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడికి కూడా అప్పగిస్తాం అంటూ వ్యాఖ్య‌లు చేశారు. రామోజీ దుర్మార్గపు రాతలను రాష్ట్ర ప్రజలు గమనించాలని అన్నారు. జగనన్న కాలనీల దగ్గరకు నేనే తీసుకెళ్తా.. దమ్ముంటే రండీ.. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది. టీడీపీ, జనసేనకు చెబుతున్నా.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడుకి చెబుతున్నా.. దమ్ముంటే రండీ అని స‌వాల్ విసిరారు.


Next Story