వైసీపీ దొంగ ఏడుపు ఏడుస్తోంది : మంత్రి గుమ్మడి సంధ్యారాణి

కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారని వైసీపీ దొంగ ఏడుపు ఏడుస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  27 Dec 2024 5:15 PM IST
వైసీపీ దొంగ ఏడుపు ఏడుస్తోంది : మంత్రి గుమ్మడి సంధ్యారాణి

కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారని వైసీపీ దొంగ ఏడుపు ఏడుస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆరు నెలల పాలనలో చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధిని చూసి ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ అండ్ పార్టీ కడుపు మంటతో రగిలిపోతోంది. జగన్ జల్సా పథకాలను ప్రజలు చూసి వైసీపీని ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. సాక్షి పత్రికకు నిబద్ధత, నిజాయితీ ఏమీ లేవు. అబద్ధాలను అలవోకగా చెప్పగలిగే ఛానల్ సాక్షి ఛానల్. వైసీపీ నాయకులు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారని దొంగ ఏడుపు ఏడుస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పది సార్లు కరెంటు బిల్లులు పెంచింది. సైకో జగన్ పది సార్లు కరెంటు బిల్లులు పెంచి వినియోగదారులపై 32 వేల కోట్ల భారాన్ని మోపారు. అందుకే ప్రజలు వైసీపీని, జగన్ ను ఛీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. వైసీపీ ప్రభుత్వం నీతి, నిజాయితీగా పాలించినట్లు ధర్నాలు నిర్వహించడం సిగ్గుచేటు. జగన్ ధర్నాలు చేస్తామనటాన్ని చూసిన ప్రజలు వైసీపీకి సిగ్గులేదని చెబుతున్నారు. 2014లో కరెంటు 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో చంద్రబాబునాయుడుకి అప్పగిస్తే.. 2014 నుంచి 2019 అంతకు ముందున్న లోటు బడ్జెట్ విద్యుత్ ను మిగులు బడ్జెట్ విద్యుత్ గా మార్చి జగన్ చేతిలో పెట్టడం జరిగింది.

హిందూజా సంస్థ నుంచి 10 ఎకరాల భూమిని తీసుకొని వారికి 14 వేల కోట్లను అప్పణంగా అప్పగించారు. ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము తినడమే వైసీపీ ప్రభుత్వం చేసిన పని. వైసీపీ నాయకుల్లో ఏ1, ఏ2, ఏ3 ముద్దాయిలు ఉన్నప్పటికి వారిని అరెస్టు చేయలేదు. వైసీపీ నాయకుల్లో అనేక మంది అనేక తప్పులు చేశారు. అయినా వారిలో అనేక మంది అరెస్టవలేదు. వైసీపీ హయాంలో నాయకులు అతి దారుణంగా ప్రవర్తించారు. సోషల్ మీడియాలో అమ్మాయిలను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. అమ్మాయిల ఫొటోలు మార్పింగ్ చేసి పోస్టులు పెట్టారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిని కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారు. అయినా అరెస్టు చేయకూడదనడం ఇదెక్కడి న్యాయం? చంద్రబాబునాయుడు ఒక్క సైగ చేస్తే చాలు వైసీపీ నాయకులు మొత్తం జైల్లో ఉంటారు. చంద్రబాబు పద్ధతిగా ప్రవర్తిస్తారు. ప్రజలు మనకు పట్టం కట్టారు. వారిని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందనేది చంద్రబాబు ఆలోచన. కక్షసాధింపు చర్యలు వద్దని చంద్రబాబు స్వయంగా చెప్పారు. చంద్రబాబు అనుకుంటే జగన్ కు చెందిన సాక్షి టీవీ, ఛానల్ లు ఉండవు. స్మశానాలపై కూడా వైసీపీ రంగులు వేసుకున్నారంటే వైసీపీకి రంగుల పిచ్చి ఏ మేరకు ఉందో అర్థమౌతోంది. గుళ్లూ, బళ్లు దేన్నీ వదలలేదు. రంగుల పిచ్చితో రూ.3 వేల కోట్లు వృధాగా ఖర్చు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ నాయకులు తిన్న ఎగ్ పఫ్ లకే రూ. 3.5 కోట్లు ఖర్చు చేశారు. మీరా టీడీపీ ప్రభుత్వం గురించి మాట్లాడేది? విద్యుత్ చార్జీల పెంపు జగన్ పాపమే..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగం గత కొన్నేళ్లుగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు పాలన సమయంలో రాష్ట్రం 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ఉన్నప్పటికీ, 2019 నాటికి రాష్ట్రం మిగులు విద్యుత్తును సాధించింది. అయితే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో అనేక సమస్యలు తలెత్తాయి. పలు అవినీతి ఆరోపణలు, కక్షసాధింపు చర్యలు విద్యుత్ రంగ అభివృద్ధిని పునరంగీకరించాయి.

చార్జీలను పెంచి ప్రజలపై మోపిన భారం అంతా ఇంతా కాదు :

జగన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఛార్జీల పెంపు నేరుగా ప్రజలపై ప్రభావం చూపింది. 5 ఏళ్లలో పది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై సుమారు రూ.28 వేల కోట్ల భారాన్ని మోపారు. ఈ పెంపు వివిధ వర్గాల వినియోగదారులపై ప్రభావం చూపింది. ముఖ్యంగా నివాస, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల పెంపు అంతా ఇంత కాదు.

సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి పద్ధతులపై కక్ష సాధించి, పీపీఏలను రద్దు చేశారు. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో రాబడి తగ్గి, విద్యుత్ ఉత్పత్తిదారులు ఆర్థికంగా నష్టపోయారు. సోలార్ ప్లాంట్లను ధ్వంసం చేయడం, వీటి యజమానులను నిరుత్సాహపరచడం వల్ల రాష్ట్రానికి మిగులు విద్యుత్ అవకాశాలు దూరమయ్యాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వినియోగంలో కూడా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

దేశంలో వృద్ధులకు ఎక్కడైనా నెలకు రూ. 4 వేలు పింఛన్ ఇచ్చే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఒక్క టీడీపీ ప్రభుత్వమే 4వేలు పింఛన్ ఇస్తోంది. ఇది మన ప్రభుత్వమని గుండెలపై చేయి వేసి చెప్పగలం. వికలాంగులకు 6 వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైనవారికి 10 వేలు ఇస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసి వెళ్లింది. అయినా మనం చెప్పిన ప్రకారం 4 వేలు పింఛన్ ఇస్తున్నాం. 10 సార్లు విద్యుత్ భారం పెంచితే వారిపై ఎంత బరువు మోపినట్లు.? ఎస్సీ, ఎస్టీలకు మళ్లీ మనం ఫ్రీ కరెంటు ఇస్తున్నాం. గత ఐదు సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీలు బిల్లులు కట్టుకున్నారు. ప్రస్తుతం రెండున్నర నెలలకు ఒకసారి వచ్చే విద్యుత్ బిల్లు వైసీపీ హయాంలో నెలకే వచ్చేది. టీడీపీ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును అందిస్తుంది. సోలార్ విద్యుత్ ను వాడాల్సిందిగా గ్రామాలలో తెలుపుతున్నాం. సోలార్ ను ఫ్రీ గా బిగించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం చేకూరుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచించారు.

Next Story