అమరావతి దెయ్యాల రాజధాని: మంత్రి అమర్నాథ్

Minister Gudivada Amarnath sensational comments on capital Amaravati. ఏపీలోని అమరావతిపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. అమరావతి దేవతల రాజధాని

By అంజి  Published on  9 Sep 2022 10:31 AM GMT
అమరావతి దెయ్యాల రాజధాని: మంత్రి అమర్నాథ్

ఏపీలోని అమరావతిపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదని.. దెయ్యాల రాజధాని అని అభివర్ణించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామన్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటుకు సంబంధించి కొత్త బిల్లుతో ముందుకు వస్తామన్నారు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రాజధాని రైతులు నిర్వహించనున్న మహాపాదయాత్రకు హైకోర్టు పర్మిషన్‌ ఇచ్చింది. ఈ క్రమంలోనే కోర్టు తీర్పును స్వాగతిస్తూ పలువురు వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన మంత్రి అమర్నాథ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి (ఏపీఎస్) చేపట్టిన మహా పాదయాత్రలో ఉత్తరాంధ్రలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత ఎన్. చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. వైజాగ్‌ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేస్తున్న వారిపై ప్రజలు మౌనం వహించరని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే సమర్ధిస్తున్నందుకు విశాఖపట్నం ప్రజలు చంద్రబాబును ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోకి రానివ్వలేదన్నారు.

అమరావతి పరిధిలోని 29 గ్రామాలతోపాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. మూడు రాజధానులకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని అమర్‌నాథ్‌ పునరుద్ఘాటించారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తామేనని చెప్పుకుంటున్న టీడీపీ అధిష్టానంపై మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో టీడీపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఎందుకు గెలవలేదని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖలో అభివృద్ధిని నయీం అడ్డుకుంటున్నారని మంత్రి విమర్శించారు.

త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లోనే మూడు రాజ‌ధానుల బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని అమ‌ర్‌నాథ్ చెప్పారు.

Next Story