రాష్ట్రానికి అగ్ర పారిశ్రామిక వేత్తలు వస్తే ప్రతిపక్షం ఓర్వలేకపోతోంది: మంత్రి గుడివాడ అమర్నాథ్

MInister Gudivada Amarnath Fire On TDP. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) పై చర్చ జరిగింది.

By Medi Samrat  Published on  18 March 2023 5:15 PM IST
రాష్ట్రానికి అగ్ర పారిశ్రామిక వేత్తలు వస్తే ప్రతిపక్షం ఓర్వలేకపోతోంది: మంత్రి గుడివాడ అమర్నాథ్

MInister Gudivada Amarnath


ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఏపీకి పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీ వస్తే టీడీపీకి ఎందుకు బాధ అని ప్రశ్నించారు. జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 25 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని, అనేక రంగాల్లో ఎంవోయూలు కుదుర్చుకున్నామని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని వివరించారు. రాష్ట్రానికి అగ్ర పారిశ్రామిక వేత్తలు వస్తే ప్రతిపక్షం ఓర్వలేకపోతోంది. ఏపీకి అంబానీ, అదానీ వస్తే టీడీపీకి బాధేంటో అర్థం కావట్లేదు. ఏపీకి పెట్టుబడులు రావడం టీడీపీకి ఇష్టం లేదని ఆరోపించారు.

అసెంబ్లీ ఐదో రోజు బడ్జెట్‌ సమావేశాల సందర్బంగా విశాఖపట్నం గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సమ్మిట్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా జీఐఎస్‌కు వచ్చినట్టు స్పష్టం చేశారు.


Next Story