పవన్‌ కల్యాణ్‌ రాజకీయ వ్యభిచారి: మంత్రి గుడివాడ

Minister Gudivada Amarnath slams Pawan kalyan over his comments in srikakulam. గురువారం నిర్వహించిన 'యువశక్తి సభ'లో పవన్ కల్యాణ్ ప్రసంగంపై మంత్రి గుడివాడ

By అంజి  Published on  13 Jan 2023 2:06 PM IST
పవన్‌ కల్యాణ్‌ రాజకీయ వ్యభిచారి: మంత్రి గుడివాడ

గురువారం నిర్వహించిన 'యువశక్తి సభ'లో పవన్ కల్యాణ్ ప్రసంగంపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్‌ పలు వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆధ్వర్యంలో నిన్న (జనవరి 12) రణస్థలం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన యువశక్తి సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై అమర్‌నాథ్ స్పందిస్తూ.. కొట్టడానికి తమకు చేతులు, కాళ్లు ఉన్నాయని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పలాచర్లలో జరిగిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్ నాథ్.. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తానని చెప్పి సభ ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివారని మంత్రి అమర్‌నాథ్ ఆరోపించారు. జనసేన అధినేత వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తానని, పవన్ కళ్యాణ్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి అన్నారు.

జనసేన పేరును చంద్రసేనగా మార్చేస్తున్నట్టు చెప్పడానికే పవన్‌ కల్యాణ్‌ సభ పెట్టాడని అన్నారు. సంక్రాంతి మామూళ్లు తీసుకుని రణస్థలంలో ఒక ఈవెంట్‌ నిర్వహించి వెళ్లాడని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్ ఒంట్లో ప్రవహిస్తున్నది 'కమ్మ'ని పసుపు రక్తం అని సెటైర్ వేశారు. పవన్‌ కల్యాణ్ కు ఉన్నవి ఉక్కు నరాలు కాదని, నారా వారి నరాలు అని హేళన చేశారు. పవన్‌ ప్రసంగం అంతా ఆంబోతు రంకెలేసినట్టుగా ఉందని.. పవన్‌ పార్టీకి ఓ విధానం గానీ ఎజెండా గానీ ఏమీ లేవని అన్నారు. పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి అని అన్నారు.

Next Story