ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు మంత్రి అభినందనలు

Minister Chelluboina Srinivasa Venugopala Krishna congratulates RRR film unit. అత్యంత ప్రజాదరణ పాటను రూపొందించి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న

By Medi Samrat  Published on  11 Jan 2023 6:47 PM IST
ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు మంత్రి అభినందనలు
అత్యంత ప్రజాదరణ పాటను రూపొందించి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం యూనిట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అభినందనలు తెలిపారు. 'నాటు నాటు..' అనే పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా అవార్డు సాధించి ప్రపంచ సినీ దిగ్గజాలను సైతం విశేషంగా ఆకట్టుకున్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి, ఇతర యూనిట్ సభ్యులు కీరవాణి, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, పాట రచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ నిపుణుల సత్తాను విశ్వ వేదికపై చాటి, ఆర్ఆర్ఆర్ బృందం తెలుగువారంతా గర్వపడేలా చేసారని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశంసించారు.


Next Story