చంద్రబాబు ఎవరిని కలిసినా.. సీఎం జగన్ గెలుపును ఆపలేరు

టీడీపీ-జనసేన తొలి జాబితాపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్‌ సామర్థ్యం అర్థం చేసుకోవచ్చని

By Medi Samrat  Published on  25 Feb 2024 9:05 PM IST
చంద్రబాబు ఎవరిని కలిసినా.. సీఎం జగన్ గెలుపును ఆపలేరు

టీడీపీ-జనసేన తొలి జాబితాపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్‌ సామర్థ్యం అర్థం చేసుకోవచ్చని.. వాళ్లు అమిత్‌షాను కలిసినా, అమితాబ్‌ బచ్చన్‌ను కలిసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. వారికి విధి విధానాలు ఏమీ లేవని వెల్లడించారు. టీడీపీ-జనసేన పార్టీల మధ్య జరిగిన తొలి జాబితా సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని.. వాళ్లకి అజెండా ఏమీ లేదని చెప్పారు. మళ్లీ దోచుకు తినడానికి ప్రయత్నిస్తున్నారని, జగన్‌ను ఓడిస్తామంటూ చెప్పుకొస్తున్నారని అన్నారు.

ఎవ‌రు ఎందులో కలిసినా జ‌గ‌న్ విజ‌యాన్ని ఆప‌లేర‌న్నారు. వైసీపీ లిస్ట్‌లలో ఎలాంటి గందరగోళం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయాలన్న అజెండాతో వైసీపీ ముందుకు వెళ్తుందని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఏం చేశారని వారు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. గతంలో వారు చేసిన మోసాలను చూసి ఓట్లు వేయాలని ప్రజలను అడుగుతారా అని ప్రశ్నించారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇచ్చారంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత విలువ ఉందో అర్థమవుతుందని అన్నారు.

Next Story