ఉద్దేశపూర్వకంగానే తప్పుడు రాతలు.. జప్తులు చేయడం గత ప్రభుత్వాల హయాంలో జరగలేదా..?
Minister Botsa Satyanarayana About Taxes. సీఎం జగన్ ప్రభుత్వం పేదలను అన్యాయం చేస్తున్నట్లు ఓ పత్రికలో కధనం వచ్చిందని..
By Medi Samrat Published on 21 March 2022 9:07 AM GMTసీఎం జగన్ ప్రభుత్వం పేదలను అన్యాయం చేస్తున్నట్లు ఓ పత్రికలో కధనం వచ్చిందని.. మాది పేదల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వమని.. అటువంటి మా ప్రభుత్వం మీద ఓ వర్గం మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎక్కడో ఒకచోట జరిగిన చిన్న సంఘటనలను సాకుగా చూపుతూ.. రాష్ట్రమంతా అవి జరిగినట్లు, జరుగుతున్నట్లు ప్రచారం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు.
ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది.. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానమని మంత్రి అన్నారు. అనధికారికంగా కుళాయి కనెక్షన్ వద్దు.. అధికారికంగా కుళాయి కనెక్షన్ తీసుకోవాలని ప్రజలను కోరారు. చట్టానికి సంబంధం లేకుండా, ఎక్కడో అనధికారికంగా జరిగే సంఘటనలకు ఈనాడు పత్రిక మద్దతు పలుకుతుందా..? అని ప్రశ్నించారు. ఎక్కడైనా వ్యవస్ధలను పటిష్టం చేయాలని కోరతారు. కుళాయి కనెక్షన్ రేట్లు అధికంగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. వారి సమస్యలను స్ధానిక సంస్దల దృష్డికి తీసుకెళ్లవచ్చని.. అలాకాకుండా, ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా మీడియా కథనాలు రాయకూడదని మంత్రి అన్నారు.
పన్నులు కట్టకపోతే జప్తులు చేయటం అన్నది ఎప్పటినుంచో ఉందని.. ఈ రోజు కొత్తగా వచ్చింది కాదని. ప్రజలని ఇబ్బంది పెట్టి జప్తు చేయడం ప్రభుత్వం ఉద్దేశం కానేకాదని మంత్రి అన్నారు. స్ధానిక సంస్ధలను సక్రమంగా నిర్వహించాలంటే పన్నులు సక్రమంగా చెల్లించాలని.. పన్నులు కట్టకపోతే.. చర్యలు తీసుకున్న ఘటనలు గత ప్రభుత్వాల హయాంలో కూడా ఎన్నో జరిగాయని అన్నారు. అప్పుడు ఎందుకు ఇలాంటి వార్తలు ఈనాడు రాయలేదు.. అంటే, ఆ పత్రిక మోటివ్స్ ఏంటో అర్థం అవుతుందని అన్నారు. బలవంతంగా పన్ను వసూలు చేయాలనిగానీ.. ప్రజలను ఇబ్బంది పెట్టాలనిగానీ.. ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదని మంత్రి అన్నారు.