మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వివరాళ్లోకెళితే.. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట - కోటప్పకొండ వెళ్లే మార్గంలో పోతవరం దగ్గర ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అదే సమయంలో ఈ రహదారిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే యాక్సిడెంట్‌ను చూసిన మంత్రి తక్షణమే స్పందించి కాన్వాయ్ ఆపి.. తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రుడిని పరామర్శించి, ఫస్ట్ ఎయిడ్ అందించి, అనంతరం అంబులెన్స్ లో హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో బాధితుడికి మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి స్థానిక అధికారులకు సూచించారు. మానవత్వంతో మంత్రి స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.