దమ్మూ, ధైర్యం ఉంటే చంద్రబాబును ఒప్పించండి

Minister Avanthi Srinivas Fires On TDP Leaders. ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట ఈ ప్రాంత టీడీపీ నేతలు డ్రామాలు ఆడే బదులు.. వైయస్ఆర్ కాంగ్రెస్

By Medi Samrat  Published on  30 Aug 2021 6:40 PM IST
దమ్మూ, ధైర్యం ఉంటే చంద్రబాబును ఒప్పించండి

ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట ఈ ప్రాంత టీడీపీ నేతలు డ్రామాలు ఆడే బదులు.. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు విశాఖే పరిపాలనా రాజధానిగా కావాలని తీర్మానించి, ఆ తీర్మానాన్ని చంద్రబాబుకు పంపాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖ పరిపాలనా రాజధానికి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది ప్రకటించిన తర్వాతే.. ఈ ప్రాంత అభివృద్ధిపై చర్చలు జరపాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలకు దమ్మూ, ధైర్యం ఉంటే విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు చంద్రబాబును ఒప్పించాలని మంత్రి అవంతి కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. పరిపాలనా రాజధానిగా విశాఖను అడ్డుకోవద్దని మంత్రి అవంతి హితవు పలికారు.

మా ప్రభుత్వ విధానం మూడు ప్రాంతాల అభివృద్దే లక్ష్యం. అ‍న్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండాలి. పరిపాలనా రాజధానిని విశాఖలో పెడితే అమరావతిని నిర్లక్ష్యం చేస్తామని కాదు.. అమరావతి ప్రాంత రైతులను కానీ, మరెవర్నీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదని స్ప‌ష్టం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్‌.. మూడు ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేయాలని మూడు రాజధానులపై అసెంబ్లీలో తీర్మానం చేశారు.

అయితే ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు అంత సానుకూలంగా స్పందించలేదు. కనీసం ఈరోజు అయినా ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరుతో చంద్రబాబు, లోకేష్‌ లేకుండా సమావేశం పెట్టుకోగలిగారు. అచ్చెన్నాయుడు ఛాలెంజ్‌ లు విసిరేముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. విశాఖపట్నం పరిపాలనా రాజధానికి మీరు అనుకూలమా? వ్యతిరేకమా? ఈ విషయంలో మీకు చంద్రబాబునాయుడును ఎదిరించే దమ్ము, ధైర్యం ఉందా? సూటిగా మీ అభిప్రాయం వెల్లడించాల‌ని అన్నారు.


Next Story