సొంత చెల్లి గురించి తప్పుగా ప్రచారం చేసిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటం సిగ్గుచేటు

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు.

By Medi Samrat
Published on : 8 July 2025 5:45 PM IST

సొంత చెల్లి గురించి తప్పుగా ప్రచారం చేసిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటం సిగ్గుచేటు

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు. మీ ఇంట్లో మహిళలు ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. మహిళల గురించి నీచాతినీచంగా మాట్లాడిన కూడా నోరు విప్పకపోగా అలాంటి వ్యాఖ్యలను ప్రోత్సాహించేలా ప్రతిపక్షం కూడా లేని ప్రతిపక్షనేత వ్యవహరించడం జుగుప్సాకరం అన్నారు. తల్లి, చెల్లి, ఆడబిడ్డ గురించి మాట్లాడుతుంటే తప్పు అని చెప్పలేని వ్యక్తి ఆ పార్టీకి నాయకుడా.? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తి గత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు.

ప్రతిపక్షంలో నెల్లూరులో నారీ సంకల్ప దీక్ష చేసిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి నాపై నోటికొచ్చినట్టు మాట్లాడాడు.. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలతో మహిళా లోకం ఉలిక్కిపడింది.. తాను చేసిన వ్యాఖ్యలను ప్రసన్న కుమార్ రెడ్డి తన తల్లి, భార్య, కుమార్తెకు వినిపించాలి. ఆ వ్యాఖ్యలను వారు హర్షిస్తారా? లేదో చెప్పాలన్నారు. మహిళల వ్యక్తిత్వ హననం ఆ పార్టీ డీఎన్ఏ లోనే ఉన్నట్టుంది. ఇకపై ఆ పార్టీ గురించి మాట్లాడకూడదనుకున్న ప్రతిసారీ మాట్లాడాల్సి వస్తోందన్నారు.

గత ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పనిచేసిన వ్యక్తి సంకర జాతి అంటూ మహిళలను కించపరిచారు. పత్రికా విలేకరి అనే చెప్పుకునే కృష్ణం రాజు ఓ టీవీ చానల్ లో అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడారు. అమరావతి మహిళలను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించారు. సొంత చెల్లి షర్మిలా రెడ్డి గురించి తప్పుగా ప్రచారం చేసిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటం సిగ్గుచేటు అన్నారు.

Next Story