నేను సంబరాల రాంబాబునే.. కానీ.. : నాగబాబు సెటైర్లకు అంబటి రియాక్ష‌న్‌..!

Minister Ambati Rambabu Reacts on Nagababu Comments. ఏపీ మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల సందర్భంగా బంజారా మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు.

By Medi Samrat  Published on  16 Jan 2023 4:03 PM IST
నేను సంబరాల రాంబాబునే.. కానీ.. : నాగబాబు సెటైర్లకు అంబటి రియాక్ష‌న్‌..!

ఏపీ మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల సందర్భంగా బంజారా మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబటి ఆధ్వర్యంలో భోగి వేడుకలు జరిగాయి. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో భోగి మంటలు వేశారు. అంబటి సరదాగా డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అంబటి పోస్టుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు స్పందించారు. 'సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేశారు. పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే ఇంకా మహత్తరంగా ఉండేది' అని ఎద్దేవా చేశారు. నాగబాబు సెటైర్లకు అంబటి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే. కానీ ముఖానికి రంగు వేయను. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను' అని వ్యాఖ్యానించారు. 'పోలవరం మేమే పూర్తి చేస్తాం ! చంద్రబాబు, పవన్ బాబు, నాగబాబుతో డాన్స్ చేయిస్తాం !' అని మరో పోస్టులో కౌంటర్ ఇచ్చారు రాంబాబు.


Next Story