అది అశుభ యాత్ర.. చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతోంది : మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

By Medi Samrat  Published on  19 Dec 2023 9:45 PM IST
అది అశుభ యాత్ర.. చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతోంది : మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి అన్నీ అపశకునాలే ఎదురయ్యాయని ఆరోపించారు. కుప్పంలో యాత్ర మొదలు పెట్టగానే నందమూరి తారకరత్న మృతి చెందారని పేర్కొన్నారు. అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో వారికే అర్ధం కావడం లేదని.. కనీసం పాదయాత్ర సభలో ఏం మాట్లాడాలో కూడా నారా లోకేష్ కు తెలియడం లేదని అన్నారు.

అసమర్థ కొడుకు కోసం వృద్ద తండ్రి చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతోందన్నారు అంబటి. లోకేష్‌లో మెటీరియల్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. శునకాన్ని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టేందుకు తండ్రి ప్రయత్నిస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కొడుకు కోసం చంద్రబాబు, అల్లుడు కోసం బాలకృష్ణ నానా తంటాలు పడుతూ పనన్‌ కళ్యాణ్ సహకారం తీసుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్ పాదయాత్ర ఏ ప్రభావం లేని యాత్ర అని, పాదయాత్ర తర్వాత కూడా లోకేష్‌లో ఏం మార్పులేదన్నారు. లోకేష్ యాత్ర వల్ల ఒళ్ళు తగ్గింది తప్ప బుర్ర పెరగలేదని అన్నారు. లోకేష్ సభకు కాస్ట్ లీ యాంకర్లు వస్తున్నారని.. మీసం తిప్పి హాస్యం చేయటంలో బాలయ్యను మించిన వారు లేరన్నారు అంబటి రాంబాబు. పవన్ మరింత కాస్ట్ లీ యాంకర్ అని.. నోట్లు, సీట్ల కోసం మాత్రమే దత్త పుత్రుడు పవన్ అనే యాంకర్ వస్తున్నాడన్నారు.

Next Story