టీడీపీని వెనక నుంచి నడిపేది ఆయనే..!
Minister Ambati Rambabu Fire On Chandrababu. పచ్చ పత్రికలు ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తున్నాయని జల వనరుల శాఖ మంత్రి
By Medi Samrat Published on 30 Aug 2022 4:35 PM IST
పచ్చ పత్రికలు ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తున్నాయని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు పచ్చ పత్రికలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రామోజీ రావుకు, టీడీపీకు విడదీయరాని బంధం ఉందని.. టీడీపీని వెనక నుంచి నడిపేది రామోజీ రావు అని ఆరోపించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కావొచ్చు.. అసలు సిసలు అధ్యక్షుడు రామోజీ రావు అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మంత్రివర్గాన్ని విస్తరించాలన్నా మంత్రి వర్గం ఏర్పాటు చేయాలన్నా రామోజీ చెప్పినట్లు చేశారని ఆరోపించారు. రామోజీ - చంద్రబాబులది విడదీయరాని బంధం అని అన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఎవ్వరికీ ఇవ్వాలని కూడా.. రామోజీ రావు డిసైడ్ చేస్తారని.. టీడీపీ అధికారంలో ఉంటే.. రామోజీ రావు, ఆయన తాబేదార్లు ఎంతైనా దోచుకోవచ్చనని విమర్శించారు.
రామోజీ రావు వియ్యంకుడుదే.. నవయుగ కంపెనీ. పోలవరం ప్రాజెక్టులో దోచుకోవడానికి రామోజీ సలహా మేరకు చంద్రబాబు రామోజీ వియ్యంకుడికి కాంట్రాక్ట్ ఇచ్చారని.. చంద్రబాబు ఉంటే దోచుకోవచ్చు.. వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉంటే దోచుకోలేమనే బాధ. సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన తరువాత రీటెండర్ పిలిస్తే ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే రూ.820 కోట్లు మిగిలాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో డీపీటీ పథకం ఉండేది.. డీపీటీ అంటే.. దోచుకో, పంచుకో, తినుకో అని వివరించారు.