మానవత్వం చాటుకున్న మంత్రి ఆళ్ల నాని

Minister Alla Nani help to Injured Person. ఏపీ డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు

By Medi Samrat  Published on  17 Jan 2022 2:33 PM IST
మానవత్వం చాటుకున్న మంత్రి ఆళ్ల నాని

ఏపీ డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి అనే వ్య‌క్తి రోడ్డు ప్రమాదానికి గురై తలకు బలమైన గాయంతో రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు. విజయవాడ కొత్త బస్టాండ్ బెంజ్ సర్కిల్ రోడ్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అదే స‌మ‌యంలో తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ లో కరోనా రివ్యూ మీటింగ్ ముగించుకొని వస్తున్న మంత్రి ఆళ్ల నాని రోడ్డు పక్కన పడి ఉన్న క్షతగాత్రుడుని గమనించారు.

వెంటనే కారు దిగి.. క్షతగాత్రుడు దగ్గరికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకొని ప్రోటోకాల్ వాహనంలో హెల్ప్ ఆసుప‌త్రికి పంపించారు మంత్రి. హెల్ప్ హాస్పిటల్ యాజమాన్యంతో స్వ‌యంగా ఫోనులో మాట్లాడి.. క్షతగాత్రుడు శ్రీనివాస్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు మంత్రి ఆళ్ల నాని. మంత్రి సూచ‌న‌తో ఆసుప‌త్రి సిబ్బంది క్షత గాత్రుడుకి వైద్యం అందిస్తున్నారు. ఆపదలో ఆపడ్బంధావుడుగా వ‌చ్చి తన ప్రాణాలు కాపాడిన మంత్రి ఆళ్ల నానికి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


Next Story