ఏపీలో భారీగా లొంగిపోయిన మిలిసియ సభ్యులు

Militia members surrendered in large numbers in AP. అల్లూరి జిల్లాలో ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఎదుట 34 మంది మావోయిస్టు మిలిసియా సభ్యులు

By Medi Samrat
Published on : 7 Dec 2022 6:24 PM IST

ఏపీలో భారీగా లొంగిపోయిన మిలిసియ సభ్యులు

అల్లూరి జిల్లాలో ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఎదుట 34 మంది మావోయిస్టు మిలిసియా సభ్యులు, ఒక మావోయిస్టు సభ్యురాలు లొంగిపోయారు. మావోయిస్టు దళ సభ్యురాలు భారతి లొంగిపోయినట్లు ఉన్నారు. పెదబయలు దళానికి చెందిన వారి వద్ద నుంచి డంప్‌ స్వాధీనం చేసుకున్నారు. దళ సభ్యురాలు భారతిపై లక్ష రూపాయలు ప్రభుత్వ రివార్డు ఉందని.. లొంగిపోయిన మిలిసియా సభ్యులకు పునరావాస చర్యలు చేపడతామని ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. గతంలో ప్రభుత్వం భారతిపై లక్ష రూపాయలు రివార్డు ప్రకటించిందని పోలీసులు తెలిపారు. లొంగిన వారి నుంచి మైనింగ్‌ డిటోనేటర్లు, తపంచా, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.



Next Story