ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్
గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పగటి సమయంలో ఎండలు కొడుతుండగా.. రాత్రి వేళల్లో వర్షాలు
By అంజి Published on 25 May 2023 9:42 AM ISTఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్
గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పగటి సమయంలో ఎండలు కొడుతుండగా.. రాత్రి వేళల్లో వర్షాలు పడుతున్నాయి. తాజాగా ఏపీకి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ఎఫెక్ట్‌తో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కొనసీమ, గోదావరి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చెట్ల కింద ఉండొద్దని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాతో పాటు యానాంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, మన్యం గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట, అల్లూరి, అనంతగిరి, అరకులోయ, జీకే వీధి, కొయ్యూరు మండల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలంగాణలో కూడా గడిచిన రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి కొన్నసాగుతుందని… ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్లు వివరించింది. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, ఖమ్మం, యాదాద్రి, రంగారెడ్డి, కొత్తగూడెం, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాజ్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
ద్రోణి ప్రభావంతో ఈరోజు అనకాపల్లి, అల్లూరి,కాకినాడ,ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశంప్రజలు,రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి పిడుగులు పడే అవకాశం ఉందిచెట్ల కింద ఉండరాదు- డా. బి ఆర్ అంబేద్కర్, ఎండి, APSDMA pic.twitter.com/gQXafHcsK1
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 25, 2023