తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ రెయిన్‌ అలర్ట్‌.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

దక్షిణకోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

By అంజి
Published on : 11 Aug 2025 8:20 AM IST

Meteorological Department, heavy rains, Telangana, Andhra Pradesh

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ రెయిన్‌ అలర్ట్‌.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

దక్షిణకోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది. బుధవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో బుధ, గురువారల్లో దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

అటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే 4 రోజులు రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Next Story