ఏపీ హోంమంత్రి రిజర్వేషన్ అంశంపై గుంటూరు జిల్లా కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు

Mekathoti Sucharitha Reservation Issue. గుంటూరు జిల్లా కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు

By అంజి  Published on  28 Aug 2021 3:59 AM GMT
ఏపీ హోంమంత్రి రిజర్వేషన్ అంశంపై గుంటూరు జిల్లా కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు

హోంమంత్రి మేకతోటి సుచరిత రిజర్వేషన్ అంశంపై నోటీసులు

వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను కోరిన కమిషన్

నోటీసును ట్విట్టర్ ఖాతాలో జతచేసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత రిజర్వేషన్ అంశంపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది. గుంటూరు జిల్లా కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఇచ్చిన నోటీసుల్లో కమిషన్ పేర్కొంది. నోటీసును ట్విట్టర్ ఖాతాలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జతం చేసింది. కాగా గతంలో ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని సుచరిత చెప్పినట్లు, ఎస్సీ రిజర్వేషన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదుపై ఎస్సీ కమిషన్ స్పందించింది.

హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద రావుపై 7,398 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో మేకతొటి సుచరిత తాను ఎస్సీ అని పేర్కొనడంతో షెడ్యూల్ కులధృవీకరణపై వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లోనూ మేకతోటి సుచరిత కాంగ్రెస్ నుండి పోటీ చేసి 1500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.


Next Story
Share it