ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో భారీ డంప్ స్వాధీనం

Maoist ammunition dump busted in Odisha-Andhra border. అల్లూరి జిల్లా ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో పోలీసులు మావోయిస్టు డంపు స్వాధీనం చేసుకున్నారు.

By Medi Samrat
Published on : 23 Nov 2022 6:14 PM IST

ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో భారీ డంప్ స్వాధీనం

అల్లూరి జిల్లా ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో పోలీసులు మావోయిస్టు డంపు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్‌గిరి జిల్లా జొడొంబో పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవి ప్రాంతంలో ఒడిస్సా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డంప్‌లో మూడు తుపాకులు, 18 మందుపాతర్లు, గ్రెనేడ్స్‌, డిటొనేటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న డంప్‌ ఆంధ్రా ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవిగా అనుమానిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.


Next Story