మాన్సాస్ ట్రస్టుపై ఆధిపత్యం కోసం అశోక్ గజపతిరాజు, ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత హోరాహోరీ పోరాటం చేయడం తెలిసిందే. తాజాగా మరొకరు తెరపైకి రావడంతో మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో త్రిముఖ పోరు నెలకొన్నట్టు కనిపిస్తోంది. ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు మాన్సాస్ ట్రస్టు అంశంలో హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా తనను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఊర్మిళ మాన్సాస్ ట్రస్టుకు వారసురాలేనని ఆమె తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా హైకోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.