వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయాలనేదే మా ప్రధాన అజెండా : మంగళగిరి జనసేన ఇంచార్జ్

సోషల్ మీడియా కథ‌నాలను మంగళగిరి జనసేన ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఖండించారు.

By Medi Samrat
Published on : 20 Jan 2024 4:18 PM IST

వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయాలనేదే మా ప్రధాన అజెండా : మంగళగిరి జనసేన ఇంచార్జ్

సోషల్ మీడియా కథ‌నాలను మంగళగిరి జనసేన ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఖండించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటికీ మా అధినేత పవన్‌కళ్యాణ్‌ అడుగు జాడల్లో నడుస్తామని స్ప‌ష్టం చేశారు. పవన్‌కళ్యాణ్‌ అదేశాల ప్ర‌కారం పార్టీకి అంకితబావంతో పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారంటే వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నిరూపించండని స‌వాల్ విసిరారు. కేవలం వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయాలనేదే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.

అభ్యర్థి ఎవరనేది తమకు ముఖ్యం కాదు కేవలం వైసీపీపై మాత్రమే తమ పోరాటమ‌న్నారు. కలిసి పనిచేయాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నామన్నారు. కావాలనే దుష్ప్రచారం చేయిస్తున్నారని రూమ‌ర్స్‌పై మండిప‌డ్డారు. పార్టీలో కోవర్టులపై ప్రశ్నించగా.. పార్టీలో కొందరు తమకు అవకాశం లేదని ఇలాంటి ప్రయత్నం చేయటం సర్వసాధారణమ‌న్నారు. పార్టీ కోసం పనిచేసే సమయంలో కొందరు దూకుడు ప్రయత్నం చేయటంలో రాజకీయ కోణంలో అలా అనటం వలన కొందరు ఆవేదన చెందుతున్న‌ట్లు వివ‌రించారు. పార్టీలో విభేదాలు సృష్టించేలా ఉంటే దాన్ని మరోలా చూడవద్దని హితవు ప‌లికారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాటం చేసేందుకు సిద్ధం.. మంగళగిరి అభివృద్ధికి కోసం కలిసి పని చేస్తామ‌న్నారు.

Next Story