పవన్ వ్యాఖ్యలపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Medi Samrat
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ నోటి నుంచి ఆ విధంగా మాటలు రావడం దురదృష్టకరమని మండిపడ్డారు. పవన్ మీ అభిప్రాయం ఎలా ఉన్నా.. లోపల మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై పవన్ ఇలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. హోంమంత్రిని అంటే.. ప్రభుత్వాన్ని అన్నట్లే.. అంటే.. సీఎంను అన్నట్టేనన్నారు. హోంమంత్రిని అనడమే కాదు.. సీఎంను కూడా పవన్ అన్నట్టేనని మందకృష్ణ మాదిగ విమర్శించారు. పవన్ తన శాఖను సరిగా నిర్వహించడం లేదని మరో మంత్రి అంటే ఎలా ఉంటుంది.? అని ప్రశ్నించారు.
కాపులకు పవన్ పెద్దన్న కావొచ్చు.. మాదిగలైన మాకు కాదు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గౌరవం ఇవ్వనపుడు ఇదేం సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు. మాట్లాడే సమయం వచ్చినపుడు మేం అన్ని విషయాలు మాట్లాడతామని తెలిపారు. కేబినెట్ అంటే కుటుంబమన్న ఆయన.. పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టమని, తమ కులానికి అవమానంగా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే పవన్ పట్ల తాము అసంతృప్తిని వ్యక్తం చేశామన్నారు. జనసేన అందరిపార్టీనా కాదా..? అని ప్రశ్నించారు. కమ్మ కాపులే కాదు అందరూ జనసేనకు ఓట్లేశారన్నారు.