కాలికి గడ్డ.. ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్‌తో ప్రాణాలు పోయాయి..!

కాలికి చిన్న గడ్డ అవడంతో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి ప్రాణం పోయింది. ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకానికి పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం బుర్రిపాలెంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి

By Medi Samrat  Published on  27 July 2024 8:08 PM IST
కాలికి గడ్డ.. ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్‌తో ప్రాణాలు పోయాయి..!

కాలికి చిన్న గడ్డ అవడంతో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి ప్రాణం పోయింది. ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకానికి పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం బుర్రిపాలెంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్‌ రియాక్షన్‌తో తాటి శ్రీను ప్రాణాలు కోల్పోయాడు. కాలికి చిన్న గడ్డ రావడంతో రవ్వారంలోని ఆర్​ఎంపీ వైద్యుడు చిన్నికొండ మల్లికార్జున్‌రెడ్డిని ఆశ్రయించారు. వైద్యం చేసి గడ్డని తొలగించారు. శ్రీను నొప్పిగా ఉందని చెప్పడంతో మల్లికార్జున్‌ ఓ ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్​ తీసుకున్న తరువాత శ్రీనుకు వాంతులు, శరీరంపై దద్దులు వచ్చాయి. కుటుంబ సభ్యులు శ్రీనును వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ శ్రీను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో ఆర్​ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్​ వికటించి శ్రీను చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

Next Story