2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రధాన కార్యక్రమాలు ఇవే..!

2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి.

By -  Medi Samrat
Published on : 14 Feb 2026 1:59 PM IST

2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రధాన కార్యక్రమాలు ఇవే..!

2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకునేలా బడ్జెట్ కొత్త కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ క్ర‌మంలోనే వివిధ రంగాల అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కేటాయింపులు జ‌రిపింది.

వివ‌రాలు ఇవే..

• రాయలసీమ గ్లోబల్ హర్టీకల్చర్ హబ్ – రూ.30 వేల కోట్లు.

• 3 సిటీ ఎకనమిక్ రీజియన్లు-విశాఖ, అమరావతి, తిరుపతి.

• వీబీ జీ రాం జీ పథకం-రూ. 8,365 కోట్లు

• ఏపీ వెల్త్ ఫండ్ – రూ. 100 కోట్లు

• నేతన్నలకు ఉచిత విద్యుత్-పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్ కు 200 యూనిట్లు ఇవ్వాలని నిర్ణయం. నేతన్నలకు ఉచిత విద్యుత్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు. లక్ష కుటుంబాలకు లబ్ది.

• పాఠశాలలు, హస్టళ్లల్లో మౌళిక సదుపాయాల కల్పన – రూ. 1800 కోట్లు

• ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో TReDS (బిల్ డిస్కౌటింగ్ విధానానికి డిజిటల్ ప్లాట్ ఫాం) అమలు

• క్వాంటం కంప్యూటింగ్- రూ. 638 కోట్లు

• దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం

• పోలీసులకు 3 వేల కొత్త పోలీస్ వాహనాలు

Next Story