ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో మంగళవారం నుండి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపటి నుండి మార్చి 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజలు రేపు ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు. 23వ తేదీ నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు పూరతి చేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యం కోసం ఆన్‌లైన్ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు.
ఆన్‌లైన్‌లో రూ. 500 అతి శీఘ్ర దర్శనం, రూ. 200 శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టికెట్లు పొందొచ్చని ఈవో లవన్న తెలిపారు. శ్రీశైలం పట్టణం మల్లికార్జున జ్యోతిర్లింగ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. హిందూ మతంలోని శైవమతం, శాక్తమత శాఖలకు పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. శ్రీశైలం రేపటి నుండి 11 రోజుల పాటు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తులు ముఖానికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఆలయ ప్రాంగణంలో శానిటైజర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వంటివి తప్పనిసరి చేశారు.