విషాదంలో టీడీపీ శ్రేణులు : మాజీ ఎంపీ తనయుడు కన్నుమూత
Maganti Ravindranath Passes Away. టీడీపీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం
By Medi Samrat Published on
2 Jun 2021 12:50 AM GMT

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండోకుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరీ (రవీంద్ర) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. పోయిన మార్చిలో మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ కూడా కన్నుమూశారు. ప్రస్తుతం రవీంద్ర మరణంతో మాగంటి బాబు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నెలల వ్యవధిలోనే ఇద్దరు కుమారులను కోల్పోవడంతో మాగంటి కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది.
రవీంద్ర హైద్రాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్-2లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఉంటూ ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మంగళవారం రాత్రి హోటల్‌లో ఆచేతన స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రవీంద్ర మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. రవీంద్ర మరణంపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది. రవీంద్ర మృతిపట్ల టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. రవీంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Next Story