విషాదంలో టీడీపీ శ్రేణులు : మాజీ ఎంపీ త‌న‌యుడు క‌న్నుమూత‌

Maganti Ramji Passes Away. టీడీపీ సీనియర్ నేత‌, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు త‌న‌యుడు మాగంటి రాంజీ మృతి చెందారు.

By Medi Samrat  Published on  8 March 2021 7:19 AM IST
Maganti Ramji Passes Away

టీడీపీ సీనియర్ నేత‌, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు త‌న‌యుడు మాగంటి రాంజీ (37) ఆదివారం రాత్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాంజీ.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం రాంజీ అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

తెలుగు దేశం పార్టీలో యువనేతగా కొనసాగుతున్న మాగంటి రాంజీ.. పార్టీ వ్యవహరాల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. రాంజీ అనారోగ్యానికి కారణం ఏమిట‌నేది మాత్రం తెలియరాలేదు. మొద‌ట్లో ఆత్మహత్యాయత్నం చేశారని ప్రచారం జరిగింది. కానీ, దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. రాంజీ మరణానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. రాంజీ మృతిప‌ట్ల టీడీపీ నాయ‌కులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. రాంజీ ఆత్మ‌కు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.


Next Story