వైసీపీకి రాజీనామా చేసిన మద్దాళి గిరి

వైసీపీ మ‌రో షాక్ త‌గిలింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేశారు.

By Medi Samrat  Published on  22 July 2024 5:18 PM IST
వైసీపీకి రాజీనామా చేసిన మద్దాళి గిరి

వైసీపీ మ‌రో షాక్ త‌గిలింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేశారు. మద్దాళి గిరి తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్టు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసిన మద్దాళి గిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2024 ఎన్నికల్లో మద్దాళి గిరికి టికెట్ లభించలేదు. గుంటూరు వెస్ట్ టికెట్‌ను జ‌గ‌న్‌ మాజీ మంత్రి విడదల రజనికి కేటాయించారు. చిలకలూరిపేట నుంచి కాక‌ గుంటూరు పశ్చిమ బ‌రిలో దిగిన రజని ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.

టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనంత‌రం గిరి అప్పటి సీఎం జగన్ ను క‌లిశారు. దీంతో టీడీపీ ఆయ‌న‌ను గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇంఛార్జ్‌ పదవి నుంచి తప్పించింది. ఆక్రమంలోనే ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయ‌న మ‌రోమారు టీడీపీలో చేరుతారా లేదా అనేది స్స్పెన్స్‌గా మారింది.

Next Story