సీఎం జగన్ నాకు న్యాయం చేస్తారని నమ్మకం వుంది

మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామికి ఈసారి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  6 Feb 2024 7:45 PM IST
సీఎం జగన్ నాకు న్యాయం చేస్తారని నమ్మకం వుంది

మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామికి ఈసారి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. మడకశిర ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి 2019లో తిప్పే స్వామి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఈర లక్కప్పకు బాధ్యతలు అప్పగించింది. ఈర లక్కప్ప సామాన్య కార్యకర్తగా వైసీపీలో ఉన్నారు. లక్కప్పను ఇంచార్జీగా నియమించడం ఒక షాకింగ్ విషయమనే చెప్పొచ్చు.

అమరావతిలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తిప్పేస్వామి మీడియాతో మాట్లాడారు. పార్టీ కన్నా వైఎస్సార్ కుటుంబమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడబోనని తెలిపారు. నేను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు.. 47 సంవత్సరాలుగా వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్నానన్నారు. చిత్తూరు జిల్లాలో సివిల్ సర్జన్ గా చేస్తున్నప్పుడే నన్ను చిత్తూరు ఎమ్మెల్యే చేశారు వైఎస్సార్. చిత్తూరు ఎంపీగా పోటీచేసి ‌ಓడిపోయాను. మడకశిరలో రెండు సార్లు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నానన్నారు. సీఎం జగన్ నాకు న్యాయం చేస్తారని నమ్మకం వుందన్నారు. జగన్ సార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొచ్చారు తిప్పేస్వామి.

Next Story