వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

వైసీపీకి గ‌ట్టి షాక్‌ తగిలింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు.

By Medi Samrat
Published on : 13 Jan 2024 6:52 PM IST

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

వైసీపీకి గ‌ట్టి షాక్‌ తగిలింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలుసుకున్న అనంతరం బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రేపోమాపో ఆయన జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. బంద‌రు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో బౌలశౌరికి గత కొంతకాలంగా విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చేరుతారనే టాక్‌ గత కొంతకాలం నుంచి వినపడుతోంది. ఆ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా లేదంటే అవనిగడ్డ, పొన్నూరు అసెంబ్లీ టికెట్ కావాలని బాలశౌరి డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై క్లారిటీ వచ్చిన తక్షణం బాలశౌరి జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story