టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన పొదలాడ నుంచే తిరిగి రేపు ఉదయం 10.19 గంటలకు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం తాటిపాక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పి.గన్నవరంలో గెయిల్, ఓఎన్‌జీసీ బాధితులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మామిడికుదురులో స్థానికులతో భేటీ అవుతారు. సోమవారం దాదాపు 16 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర కోసం ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సెప్టెంబరు 9న సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో లోకేశ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇటీవల చంద్రబాబుకు రెగ్యులర్ బెయిలు లభించడంతో పాదయాత్ర కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. సెప్టెంబరు 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేశ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. అక్కడి నుంచే తిరిగి ప్రారంభించనున్నారు.