ఆధార్‌ కార్డుతో రేషన్‌ కార్డుల అనుసంధానం : ఈ–కేవైసీ గడువు 15వ తేదీ వరకు పొడిగింపు

Link Aadhaar With Ration Card By September 15. ఆధార్‌ కార్డుతో ఎలక్ట్రానిక్‌ పద్ధతిన వినియోగదారుల రేషన్‌ కార్డుల అనుసంధానం

By Medi Samrat  Published on  1 Sept 2021 3:12 PM IST
ఆధార్‌ కార్డుతో రేషన్‌ కార్డుల అనుసంధానం : ఈ–కేవైసీ గడువు 15వ తేదీ వరకు పొడిగింపు

అమరావతి : ఆధార్‌ కార్డుతో ఎలక్ట్రానిక్‌ పద్ధతిన వినియోగదారుల రేషన్‌ కార్డుల అనుసంధానం చేసే(ఈ–కేవైసీ) గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ ప్రకటించారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ–కేవైసీ నమోదు గడువు ఆగస్టు 31తో ముగిసింది.

వరుస సెలవులు, పండుగలు రావడం, సర్వర్లు సరిగా పని చేయక పలు చోట్ల ఆధార్‌ నమోదు కేంద్రాలు పని చేయలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గడువు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదన్నారు. ఆపై వయసున్న పిల్లలకు సెప్టెంబర్‌ వరకు గడువు ఉందని, పెద్దలు మాత్రం సెప్టెంబర్‌ 15లోగా చేయించుకోవచ్చని వివరించారు.


Next Story