విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో భాగమైన ఓ వ్యక్తి జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. విధినిర్వహణలో ఉన్న కోటేశ్వరరావు అనే విద్యుత్ లైన్ మన్ వరదకు కొట్టుకుపోయి చనిపోయిన విషాద ఘటన గురించి బయటకు తేలింది. ఈ ఘటనపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లైన్ మన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
గత మూడు రోజుల్లో విజయవాడ సమీప ప్రాంతాలలో వచ్చిన వరదలు ఊహించని విధంగా ఎంతో మంది జీవితాలను తలక్రిందులు చేసింది. అకాల వర్షం కారణంగా 17,000 మంది వ్యక్తులు ప్రభావితమయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలో గత 50 సంవత్సరాలలో అత్యంత భారీ వర్షాన్ని నమోదు చేసింది. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించింది.