వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి టీడీపీకి సవాల్ విసిరారు. ప్రజాబలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసి తీరాలని సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ వేరు.. ఇప్పుడున్న టీడీపీ వేరని పేర్కొన్నారు. టీడీపీ చంద్రబాబు చేతిలోకి వచ్చాక.. మహిళలను ఘోరంగా అవమానిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ వచ్చాక పార్టీలో సంస్కారం లోపించిందని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడుకు యాభై వేల మంది హాజరయితే .. తమ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు లక్షల మంది జనం వస్తున్నారని లక్ష్మీ పార్వతి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.