సంస్కృతం తో కూడిన తెలుగు భాషను ప్రజలు మాట్లాడుతున్నారని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి అన్నారు. తెలుగు, సంస్కృత భాషను విడదీయలేమని.. తెలుగు సంస్కృత అకాడమీపై రాజకీయ పార్టీల నేతలు ఉత్తరాలు మీద ఉత్తరాలు రాస్తున్నారని.. దీనిని రాజకీయం చేయొద్దని లక్ష్మీ పార్వతి అన్నారు. తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు పై అభ్యంతరాలు ఉంటే స్పష్టంగా చెప్పాలని అన్నారు. తెలుగు భాషపై చంద్రబాబు, లోకేస్‌కు అసలు అవగాహన ఉందా..? అని ప్రశ్నించారు. తెలుగు అకాడమీ కోసం ఎంతగానో న్యాయ పోరాటం చేసామని గుర్తుచేశారు. అపోహలు ఉన్నవారు తెలుగు అకాడమీకి సంబంధించిన బైలా చదవండని.. పీవీ నరసింహారావు రూపొందించిన బైలా ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలను రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారని లక్ష్మీ పార్వతి అన్నారు.