కర్నూలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది

By Medi Samrat  Published on  27 July 2024 7:30 PM IST
కర్నూలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థి సాయికార్తీక్‌ హాస్టల్‌ భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు సాయి కార్తీక్.

జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీలో రెండు రోజుల క్రితం అధ్యాపకులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడని తోటి విద్యార్థులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ భవనం 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యను కప్పిపుచ్చడానికి కాలేజీ యాజమాన్యం ప్రయత్నించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Next Story