ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి

KS Jawahar Reddy to take charge as AP Chief Secretary. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌. జవహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

By Medi Samrat  Published on  30 Nov 2022 7:41 PM IST
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌. జవహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. సమీర్‌ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన నేడు బాధ్యతలు స్వీకరించారు. 2024 జూన్‌ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి దాకా అందేందుకు కృషి చేస్తానని, పల్లెల్లోని పేదలకు ఫలాలు అందేలా యంత్రంగాన్ని నడిపిస్తాని కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు.

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌శర్మ నవంబర్‌ 30న పదవీ విరమణ చేయగా.. సీఎస్‌గా జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జహహర్‌రెడ్డి ప్రస్తుతం సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా పనిచేశారు. ప్రస్తుతం సీఎం ప్రత్యేక సీఎస్‌గా ఉన్న జవహర్‌రెడ్డిని నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.


Next Story