వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కూనసాని వినోద్ అరెస్ట్ అయ్యాడు. గుడివాడ వన్ టౌన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా గుడివాడ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.50 వేల నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి పోలీసు స్టేషనుకు వెళ్లారు. అక్కడ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు మాధవ్ ను విచారించారు. అనంతరం సీఆర్పీసీ 41ఏ నోటీసులను ఇచ్చి పంపించారు. కేసు విచారణకు సహకరించాలని సూచించారు. గతంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లిలో మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.