కొత్తగా ఏర్పాటైన ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ చైర్మన్ పదవి నియామకాన్ని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. పార్టీ గెలుపు కోసం ఎలాంటి బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఆ పదవిపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. జగన్ కేబినెట్ నుంచి 24 మందితో కొడాలి నాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అయితే కొత్త కేబినెట్ లిస్టులో కొడాలి పేరు ఉండొచ్చని ప్రచారం జరిగినా.. ఈక్వేషన్ లో భాగంగా చివరి నిమిషాల్లో ఆయన పేరు గల్లంతైంది. ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కొడాలి నానిని ఎలాంటి సందేహం లేకుండా నియమిస్తున్నట్లు స్వయంగా సీఎం జగన్ ప్రకటించారు. కొడాలి నానికి ప్రొటోకాల్ ప్రకారం అన్ని సౌకర్యాలతో కేబినెట్ హోదా ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే కొడాలి నాని ఆ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదని, ఇదే విషయాన్ని జగన్ కు మర్యాదపూర్వకంగా తెలియజేసినట్లు తెలుస్తోంది.