జగన్ ప్రభంజనాన్ని ఆపే శక్తి ప్రశాంత్ కిషోర్, చంద్రబాబులకు లేదు
పీకే నీ చెత్త పంచాంగం ఆపు అంటూ ప్రశాంత్ కిషోర్‌కు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటరిచ్చారు.
By Medi Samrat Published on 4 March 2024 9:50 AM GMTపీకే నీ చెత్త పంచాంగం ఆపు అంటూ ప్రశాంత్ కిషోర్‌కు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటరిచ్చారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ పనిలేక ఖాళీగా ఉన్నాడని.. ప్రశాంత్ కిషోర్‌ను I -PAC నుంచి తన్ని తరిమేసిందన్నారు. బిహార్‌లో పాదయాత్ర చేసి ప్రశాంత్ కిషోర్ ఫెయిల్ అయిపోయాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకుని టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతాడని ఆరోపించారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ వస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు.. వచ్చిందా..? అని ప్రశ్నించారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లలో కాంగ్రెస్ వస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు.. వచ్చిందా..? ప్రశాంత్ కిషోర్ నోటికొచ్చినట్లు పిచ్చివాడు వాగుతున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ ప్రభంజనాన్ని ఆపే శక్తి ప్రశాంత్ కిషోర్, చంద్రబాబులకు లేదన్నారు. వైఎస్ఆర్ సీపీ 150కిపైగా సీట్లు వస్తాయన్నారు.
సిద్ధం సభలు చూశాక పీకే పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడంటే.. చంద్రబాబు ప్యాకేజీ గట్టిగానే ఇచ్చి ఉంటాడన్నారు. ప్రశాంత్ కిషోర్ చిల్లరగాడని నిప్పులు చెరిగారు. రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లు.. దీనిలో రూ.2.50 లక్షల కోట్ల అప్పులు చంద్రబాబు చేసినవేనన్నారు.
చంద్రబాబు చిల్లరోడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా.? అని నిలదీశారు. కమ్మవాళ్లు 3 శాతముంటే.. 30 మందికి సీట్లు.. 20 శాతం ఉన్న కాపులకు ఇచ్చిన సీట్లు 24.. ఇదెక్కడి న్యాయం.? అది కూడా జనసేన ఓడిపోయే సీట్లు ఇచ్చాడని ఫైర్ అయ్యారు.
వెన్నుపోటు అనగానే గుర్తొచ్చేది ఇద్దరేనన్నారు. ఒకరు చంద్రబాబు.. రెండోది నాదెండ్ల.. ఇద్దరూ పవన్ పక్కనే ఉంటారన్నారు. చంద్రబాబు దగ్గర నుంచి పవన్‌ను రక్షించుకోవాల్సిన అవసరం జనసైనికులకు, కాపులకు ఉందన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నారా - నాదెండ్ల వారికి పవన్ ఎంత..? అని ప్రశ్నించారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌లు ఇద్దరూ కూడా పవన్‌కు కుడి - ఎడమగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీ వారేనన్నారు.. టీడీపీ ఓట్లు పవన్ కల్యాణ్‌కు పడవన్నారు.