రంగా హత్య కేసులో వారి ప్ర‌మేయం ఉంది : కొడాలి నాని

Kodali Nani Comments On Vangaveeti Ranga Murder. వంగవీటి రంగా వ్యక్తి కాదు.. వ్యవస్థ.. అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

By Medi Samrat
Published on : 26 Dec 2022 2:48 PM IST

రంగా హత్య కేసులో వారి ప్ర‌మేయం ఉంది : కొడాలి నాని

వంగవీటి రంగా వ్యక్తి కాదు.. వ్యవస్థ.. అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు వంగవీటి రాధాను కలిస్తే చంద్రబాబు తిట్టాడ‌ని.. రంగాను హత్య చేసినవారు టీడీపీలోనే ఉన్నారని నాని ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని రంగా వేడుకున్నా.. ఆనాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. రంగాను చంపింది వ్యక్తులు కాదు.. టీడీపీ వ్యవస్థ అని ఆరోపించారు. రంగా పేరు చెప్పకుండా రాజకీయం చేయలేని దుస్థితి టీడీపీది అని విమ‌ర్శించారు.

వంగవీటి రంగాను తొక్కేయాలని అడుగడుగునా ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో భౌతికంగా అడ్డు తొలగించారని అన్నారు. రంగా చావుకు కారణమైన వారు కూడా.. నేడు ఆయన బూట్లు నాకుతున్నారని వ్యాఖ్యానించారు. రంగా హత్య కేసులో చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. రంగా హత్య కేసులో దేవినేని ఉమా, వెలగపూడి రామకృష్ణ ముద్దాయిలు అని పేర్కొన్నారు.

వంగవీటి రంగా కుటుంబంతో త‌న‌కు అనుబంధం ఉందని తెలిపారు. వంగవీటి రాధా మా కుటుంబ సభ్యుడు. రాధాతో మా ప్రయాణం పార్టీలకు అతీతం. మరణించే వరకూ రంగా ఆశయాలు కొనసాగిస్తాన‌ని తెలిపారు. గుడివాడలో ఎవరూ గెలవాలో ప్రజలు నిర్ణయిస్తారని కొడాలి నాని అన్నారు.


Next Story