మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తుంది. గుండెలో మంటగా అనిపించడంతో ఆయనను వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ట్రిక్ సమస్య అయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని.. ఇటీవల ఎన్నికల్లో వెనిగండ్ల రాము చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. హైదరాబాద్‌కే పరిమితమైనట్లు వార్తలు వచ్చాయి. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు కానీ.. కుటుంబసభ్యులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.