6 రోజుల్లో రూ.600 కోట్లు వచ్చింది.. ఐదేళ్ల‌లో ఎంత ఆదాయం రావాలి.? : మంత్రి అచ్చెన్నాయుడు

లిక్కర్, శాండ్ పాలసీలు అద్బుతమైన పాలసీలు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు

By Medi Samrat  Published on  21 Oct 2024 4:57 PM IST
6 రోజుల్లో రూ.600 కోట్లు వచ్చింది.. ఐదేళ్ల‌లో ఎంత ఆదాయం రావాలి.? : మంత్రి అచ్చెన్నాయుడు

లిక్కర్, శాండ్ పాలసీలు అద్బుతమైన పాలసీలు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గతంలో అంతా జగనేన‌ని.. లిక్కర్ లో కోట్లు కొల్లగొట్టి.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 6 రోజుల్లో రూ.600 కోట్లు ఆదాయం వచ్చింది.. ఐదు సంవత్సరాలకు ఎంత ఆదాయం రావాలి.? అని ప్ర‌శ్నించారు. అప్లికేషన్లలో 2 వేల కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇది ఎవరూ అమలు చేయడం లేదు.. ఇది పబ్లిక్ పాలసీ అని పేర్కొన్నారు.

ఇసుకంతా.. జగన్ దోచుకున్నాడని ఆరోపించారు. ఉచిత ఇసుక ఇస్తున్నాం. సీనరేజి సమస్య ఉండకుండా.. సీనరేజి రద్దు చేశాం.. రూ.300 కోట్లు నష్టం వచ్చినా సీనరేజి రద్దు చేశామ‌ని తెలిపారు. ట్రాక్టర్ ఉంటే.. ఎవరైనా ఇసుక తెచ్చుకోండ‌ని అని స్ప‌ష్టం చేశారు. ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు, RTO ఎవరైనా అపితే యాక్షన్ తీసుకుంటామ‌న్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవు అని హెచ్చ‌రించారు. మీరు చేసిన పాపమే గుర్ల గ్రామంలో సమస్య.. ఐదేళ్లు కనీసం గ్రామాల్లో పారిశుధ్యాన్ని గాలికోదిలేసారు. గుర్లలో వాటర్ కలుషితం అయ్యిందంటున్నారు. సీనియర్ ఐఏఏస్ తో విచారణ జరిపిస్తున్నామ‌ని తెలిపారు.

Next Story