ఏపీ పైబర్ నెట్ కేసులో కీలక పరిణామం
ఏపీ పైబర్ నెట్ కేసులో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది.
By Medi Samrat Published on 21 Nov 2023 3:00 PM GMTఏపీ పైబర్ నెట్ కేసులో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తోపాటు, కనుమూరి కోటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసుపై విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో రూ.114 కోట్లు దుర్వినియోగం అయ్యాయని సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వేమూరి హరికృష్ణ, ఏ 2గా టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్, ఏ 25గా చంద్రబాబు పేర్లను సీఐడీ చేర్చింది.
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో రూ.114 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు ఏసీబీ కోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో ఉన్న ఏడుగురు నిందితులకు చెందిన రూ.114 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ ఆస్తుల అటాచ్‌కు సిద్ధమైంది. అందుకు హోంశాఖ సైతం ఆమోదం తెలిపింది. దీంతో ఆస్తుల అటాచ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి కోరింది సీఐడీ. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు నాయుడు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్థులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.