ఏపీలో గెలుపెవరిదో చెప్పిన కేసీఆర్..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు

By Medi Samrat  Published on  24 April 2024 8:33 AM IST
ఏపీలో గెలుపెవరిదో చెప్పిన కేసీఆర్..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. ఏపీ ఎన్నికల్లో మీకు ఎవరు గెలవాలని అనుకుంటున్నారంటూ ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. వాస్తవంగా మాట్లాడుకుంటే అక్కడ ఏమి జరిగినా మాకంత పట్టింపు లేదని కేసీఆర్ అన్నారు. ఎవరి అదృష్టం బాగుంటే వాళ్లు గెలుస్తారు. మాకు వస్తున్న సమాచారం ప్రకారం మళ్లీ సీఎం జగన్ గెలుస్తారని అనిపిస్తోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదని.. అయితే మాకందిన సమాచారం ప్రకారం సీఎం జగన్ మళ్ళీ గెలుస్తారని కేసీఆర్ అన్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ను ప్రధాని మోదీ సృష్టించిన బోగస్‌గా కొట్టిపారేశారు కేసీఆర్. "మొదట వారు ఈ కేసులో కల్వకుంట్ల కవిత సాక్షి అని చెప్పారు. ఇప్పుడు ఆమెను నిందితురాలిగా చేర్చారు. డబ్బు రికవరీ కాలేదు. ఇది స్కామ్ కాదు, మోదీ రాజకీయ పథకం, మోదీ ప్రభుత్వం సృష్టించిన కాక్ అండ్ బుల్ స్టోరీ, మోదీ చేసిన భయంకరమైన పాపం, ”అని ఆయన అన్నారు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు తన కూతురు బయటకు వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. అమాయకులను శిక్షించేందుకు దర్యాప్తు సంస్థలను మోదీ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

Next Story