వాటి గురించే అవినాష్ రెడ్డిని ఎక్కువగా ప్రశ్నించారట

Kadapa MP YS Avinash Reddy. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్

By Medi Samrat  Published on  4 Jun 2023 12:00 PM IST
వాటి గురించే అవినాష్ రెడ్డిని ఎక్కువగా ప్రశ్నించారట

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ శనివారం నాడు ముగిసింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారణకు హాజరుకావాలన్న కోర్టు ఆదేశాల మేరకు అవినాష్ హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయనను సీబీఐ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ప్రధానంగా వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆయన ఎవరెవరితో మాట్లాడారన్న దానిపై ఆరా తీశారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి తన నివాసానికి వెళ్లిపోయారు. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు తర్వాత తొలిసారి వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ శనివారం నాడు హైదరాబాద్ లో విచారించింది. విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందులో వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపైనే ప్రశ్నించినట్లు సమాచారం.

వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు రాత్రి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పలువురితో వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు కూడా తెలిపింది. వాటి డేటాను వెలికితీసే అవకాశం లేదు. దీంతో సదరు వాట్సాప్ కాల్స్ ఎవరితో మాట్లాడారన్న దానిపై అవినాష్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా ఆయన రాకపోవడం హాట్ టాపిక్ గా నిలిచింది.


Next Story