ఆ వీడియో పోస్ట్ పెట్టిన వారిపై.. ఫార్వర్డ్ చేసినోళ్ల‌పై కఠిన చర్యలు

Kadapa District SP Anburajan Serious On Fake News. కడప జిల్లా జమ్మలమడుగులో నడి రోడ్డుపై మారణాయుధాలతో ఓ వ్యక్తిని కొందరు హత్య చేస్తున్నట్టు

By Medi Samrat  Published on  29 Aug 2021 6:03 PM IST
ఆ వీడియో పోస్ట్ పెట్టిన వారిపై.. ఫార్వర్డ్ చేసినోళ్ల‌పై కఠిన చర్యలు

కడప జిల్లా జమ్మలమడుగులో నడి రోడ్డుపై మారణాయుధాలతో ఓ వ్యక్తిని కొందరు హత్య చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టి అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేలా కొందరు ఆకతాయిలు ఒక వీడియోను వైరల్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని.. పోస్ట్ పెట్టిన వారిని, ఫార్వర్డ్ చేస్తున్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఎస్పీ వివరించారు. ఎవరైనా అసత్య వార్తలను, అవాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హల్చల్ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అన్బురాజన్ హెచ్చరించారు.


Next Story