అవును.. పోటీ చేస్తున్నాం: కేఏ పాల్

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  9 Oct 2023 8:00 PM IST
అవును.. పోటీ చేస్తున్నాం: కేఏ పాల్

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతూ ఉన్నాయి. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని విశాఖపట్నంలో స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందని.. తెలంగాణ ఎన్నికల్లో మా పార్టీ నుంచి 119 మంది అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని అన్నారు.

కులమతాలకు అతీతంగా ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి చేస్తానని అన్నారు కేఏ పాల్. నేను దేశం, మన తెలుగు రాష్ట్రాలను కాపాడుకుంటున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రూపాల స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటు పరం చేయకుండా ఆపేశారు. ఏపీలో బీజేపీ పార్టీ లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనల గొడవలు ఆగిపోవలని దేవుడికి ప్రార్థన చేశానన్నారు. శాంతి కోసం మీరందరు కూడా ప్రార్థన చేయాలన్నారు. డిసెంబర్10వ తేదీన ప్రపంచ గ్లోబల్ క్రిస్మస్ వేడుకలు చేస్తున్నాం. గ్లోబల్ క్రిస్మస్ వేడుకలకు 5 వేల మందిని ఆహ్వానిస్తున్నామన్నారు. 200 దేశాలకి శాంతి సందేశం ఇస్తానని కేఏ పాల్ తెలిపారు.

టీడీపీ పని అయిపోయిందని, అవినీతి చంద్రబాబు ఇప్పటికైన తన తప్పుల్ని ఒప్పుకోవాలని కేఏ పాల్ హితవు పలికారు. టీడీపీ వాళ్లు ప్రజా శాంతి పార్టీలో చేరితే మంచిదని, చంద్రబాబుకు హైకోర్టులో ఇవాళ బెయిల్‌ రాదని తానుముందే ఊహించానని అన్నారు. లోకేష్‌ ఢిల్లీలో ఎంత తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని, అలానే తన పాపాలతో దేవుడ్నిని కూడా చంద్రబాబు శత్రువుని చేసుకున్నారంటూ పాల్ అన్నారు. గత ఎన్నికల్లో పవన్ తో కలిసి పోటీ చేసిన పార్టీలన్నీ దారుణంగా ఓడిపోయాయి. పవన్ కళ్యాణ్ ది ఐరన్ లెగ్ అని అన్నారు. పవన్ కు ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు.. ఎవరూ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబుకు పవన్‌ అమ్ముడుపోయారని కేఏ పాల్ ఆరోపించారు.

Next Story